24 గంటల్లో 86,432 కేసులు.. 1089 మరణాలు

తాజా వార్తలు

Updated : 05/09/2020 10:33 IST

24 గంటల్లో 86,432 కేసులు.. 1089 మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా కొత్త కేసులు రోజురోజుకీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 86,432 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. వీరిలో 8,46,395 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 31,07,223 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 69,561కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక కేసుల సంఖ్య 15,271 మేర పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇది తగ్గడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 19,218 కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల పెరుగుదలలోనూ మహారాష్ట్రదే తొలిస్థానం. ఇక దేశరాజధాని దిల్లీలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం 2,194 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులు. 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,77,38,491 కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌దే సింహభాగం. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్రియాశీలక కేసుల్లో 62 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లోనూ 70 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని