24 గంటల్లో 79,476 కేసులు.. 1,069 మరణాలు

తాజా వార్తలు

Published : 03/10/2020 09:56 IST

24 గంటల్లో 79,476 కేసులు.. 1,069 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 11,32,675 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64,73,545 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 54,27,707 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. మరో 9,44,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా 1,069 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 1,00,842కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 75,628 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.84 శాతంగా, మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని