24 గంటల్లో 92,071 కేసులు.. 1,136 మరణాలు

తాజా వార్తలు

Published : 14/09/2020 10:25 IST

24 గంటల్లో 92,071 కేసులు.. 1,136 మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,78,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,071 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. వీరిలో 9,86,598 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 37,80,107 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,136 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 79,722కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 28,902,170 కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,22,735 మంది మృత్యువాతపడ్డారు. 65,19,554 కేసులు, 1,94,073 మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. భారత్‌, బ్రెజిల్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని