చైనా సైనికుణ్ని అప్పగించిన భారత్‌!
close

తాజా వార్తలు

Updated : 21/10/2020 10:02 IST

చైనా సైనికుణ్ని అప్పగించిన భారత్‌!

లద్దాఖ్‌: వాస్తవాధీన రేఖను దాటి మన భూభాగంలోకి తప్పిపోయి వచ్చిన చైనా సైనికుడిని భారత్‌ తిరిగి వారికి అప్పగించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.  ప్రోటోకాల్‌ ప్రకారం బుధవారం చుషూల్‌-మోల్దో మీటింగ్‌ పాయింట్‌ వద్ద అయన్ని చైనా బలగాలకు అప్పగించినట్లు సమాచారం. సైనికుణ్ని తమ దళాల్లో చేర్చుకునేందుకు ముందు డ్రాగన్‌ సేనలు అతణ్ని క్షుణ్నంగా తనిఖీ చేసి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 

తమ సైనికుణ్ని అప్పగించాలంటూ మంగళవారమే చైనా.. భారత్‌కు విజ్ఞప్తి చేసింది. తప్పిపోయిన తన జడల బర్రెను వెతికిపెట్టాలన్న స్థానికుడి విజ్ఞప్తి మేరకు అతడు పొరపాటున సరిహద్దు దాటినట్లు తెలిసింది. సదరు సైనికుణ్ని గుర్తించామని తెలిపిన భారత్‌ సేనలు.. వైద్య పరీక్షలు నిర్వహించాక ప్రోటోకాల్‌ను అనుసరించి అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు నేడు ఆ హామీని నిలబెట్టుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని