భారత్‌: ఒకేరోజు 9971 కేసులు, 287మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 07/06/2020 13:56 IST

భారత్‌: ఒకేరోజు 9971 కేసులు, 287మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో కొవిడ్‌-19 బయటపడిన అనంతరం మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9971 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,46,628కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. అంతేకాకుండా దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో 287మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6929కి చేరింది. కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 1,19,292 మంది కోలుకోగా మరో 1,20,406 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇంకా లక్షకు పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

తాజా కేసులతో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్‌ను దాటి భారత్‌ 5వ స్థానానికి చేరినట్లు జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీనికి ఒకరోజు క్రితమే కేసుల సంఖ్యలో భారత్‌ ఇటలీని కూడా దాటివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 2లక్షల 86వేల కేసులతో యూకే నాల్గో స్థానంలో ఉండగా..2 లక్షల 41వేల కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. కరోనా మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో 12స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడా 7850 మరణాలతో 11స్థానంలో ఉండగా.. దాదాపు 6వేల మరణాలతో నెదర్లాండ్‌ 13స్థానంలో కొనసాగుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని