ట్రంప్‌.. భారత్‌పై మరోసారి
close

తాజా వార్తలు

Published : 23/10/2020 13:31 IST

ట్రంప్‌.. భారత్‌పై మరోసారి

భారత్‌, చైనా, రష్యాల్లోని వాయుకాలుష్యంపై విమర్శలు

వాషింగ్టన్‌: పారిస్ వాతావరణ ఒప్పందం  విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు మిత్రదేశంగా చెప్పుకొనే భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరుగుదలకు భారత్, రష్యా, చైనా దేశాలు కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు.  ‘చైనాను చూడండి, ఎంత మురికిగా ఉందో. రష్యా, భారత్‌ వైపు చూడండి. అక్కడి గాలి మురికిగా ఉంది. ట్రిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించాల్సి ఉండటం, మాతో వారి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మేం పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చాం. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, వేల సంఖ్యలో కంపెనీలను ఆ ఒప్పందం కోసం నేను త్యాగం చేయలేను. అది చాలా అన్యాయంగా ఉంది’ అంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తుది ముఖాముఖి సంవాదంలో ట్రంప్ పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు రావడాన్ని సమర్థించుకున్నారు. అయితే, భారత్‌పై ట్రంప్ ఈ తీరుగా మాట్లాడటం ఇదే మొదటిసారేమీ కాదు. 

కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇది ‘హౌడీ మోదీ’ ఫలితం’ అంటూ ఎద్దేవా చేశారు. ‘భారత్ మురికిగా ఉంది. నరేంద్ర మోదీ మీరు వింటున్నారనుకుంటాను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

ఇదిలా ఉండగా..గ్లోబల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్‌ దిగువకు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ప్రపంచ దేశాల మధ్య పారిస్ ఒప్పందం కుదిరింది. అయితే, 2017లో ట్రంప్‌ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీసింది. కాగా, ఆ నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని