
తాజా వార్తలు
26/11 గాయాలను భారత్ ఎన్నటికీ మరువదు: మోదీ
నూతన విధానాలతో ఉగ్రవాదంపై భారత్ పోరు
దిల్లీ: ముంబయి పేలుళ్ల గాయాలను యావత్ భారత్ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగిస్తుందన్నారు. ముంబయి పేలుళ్లు జరిగి 12ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
‘దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఘటన జరిగిన రోజు ఇది. 2018లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఆ ఘటనలో ఎంతో మంది భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో మరణించిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ముంబయి వంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉగ్రవాదాన్ని తిప్పికొడుతున్న మన భద్రతా సిబ్బందికి నమస్కరిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా.. శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్లతో గుజరాత్లో జరిగిన సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బాంబు పేలుళ్లు జరిగి నేటికి 12 సంవత్సరాలు అయ్యింది. లష్కరే తోయిబా ఉగ్రమూకలు ముంబయి నగరంలో 12 చోట్ల నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 60గంటలపాటు జరిగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బందిని అక్కడే మట్టుబెట్టగా, మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో ఉరితీశారు.
ఇవీ చదవండి..
26/11: ఆ మారణహోమానికి 12ఏళ్లు
నవంబర్ ..తుపాన్ల మాసం
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- సాహో భారత్!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- అందరివాడిని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
