భారత్‌లో 6 లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 30/10/2020 10:31 IST

భారత్‌లో 6 లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు

తాజాగా 48,648 కొత్త కేసులు.. 563 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 6 లక్షల దిగువకు చేరగా.. మొత్తం కేసుల సంఖ్య 81 లక్షలకు చేరువైంది. గురువారం 11,64,648 నమూనాలను పరీక్షించగా 48,648 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 563 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,21,090కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 57,386 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 73,73,375 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 5,94,386 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దాదాపు 90.99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 7.51 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని