42,156 రికవరీలు.. 41,100 కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 15/11/2020 14:58 IST

42,156 రికవరీలు.. 41,100 కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,05,589 పరీక్షలు జరపగా.. కొత్తగా 41,100 కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 8శాతం కేసులు తగ్గాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది. వీరిలో 82,05,728 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 42,156 మంది ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.  మరో 4,79,216 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 5.44శాతానికి తగ్గింది. ప్రస్తుతం మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.09శాతానికి పెరిగింది. ఇక కొత్తగా 447 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,29,635కి చేరింది. రోజుకి సగటు కేసుల సంఖ్య గత ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో పంచుకుంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని