close

తాజా వార్తలు

Published : 04/12/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

90లక్షల మందికి పైగా కోలుకున్నారు

దిల్లీ: భారత్‌లో గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 40 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గురువారం 11,70,102 కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 36,595 కొత్త వైరస్ కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 95,71,559కి చేరింది. కొత్త పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం.. రోజురోజుకూ క్రియాశీల రేటు(4.35శాతం)తగ్గుతూ, రికవరీ రేటు(94.20శాతం) పెరుగుతుండటం కాస్త ఊరట కలిగించే అంశాలు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,16,082గా ఉంది. ఇప్పటివరకు 90,16,289 మంది వైరస్‌ నుంచి కోలుకోని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 540 మంది మృత్యు ఒడికి చేరుకోగా..మొత్తం మీద ఈ మహమ్మారికి 1,39,188 మంది బలయ్యారు. 

6.5 కోట్లు దాటిన కరోనా కేసులు:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తూనే ఉంది. అగ్రదేశం అమెరికా ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితం కాగా, భారత్, బ్రెజిల్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 6.5 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పటివరకు 6,50,48,192 మంది వైరస్‌ బారిన పడగా..15 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన