దిగొస్తున్న కరోనా..!

తాజా వార్తలు

Published : 20/12/2020 11:10 IST

దిగొస్తున్న కరోనా..!

దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకీ దిగొస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 11,07,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,624 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది. ఇక కొత్తగా 29,960 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 95,80,402కు చేరింది. దీంతో రికవరీ రేటు 95.46 శాతానికి చేరింది.

మరోవైపు, గడిచిన 24 గంటల్లో 341 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,45,477కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,05,344కు పరిమితమైంది. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.

ఇవీ చదవండి..

‘టీకా తయారీ సంస్థలను ప్రభుత్వమే రక్షించాలి’

1,00,04,599.. దేశంలో కోటి దాటిన కరోనా కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని