12వ రోజు..400 దిగువనే మరణాలు

తాజా వార్తలు

Published : 24/12/2020 10:30 IST

12వ రోజు..400 దిగువనే మరణాలు

24 గంటల్లో 24,712 కొత్త కేసులు..312 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. బుధవారం 10,39,645 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,712మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. జనవరి 30న తొలికేసు వెలుగుచూసిన దగ్గరి నుంచి 1,01,23,778 మంది వైరస్ బారిన పడ్డారు. 

ఇక క్రియాశీల కేసుల సంఖ్య 2,83,849గా ఉండగా.. ఆ రేటు 2.80 శాతానికి చేరింది. నిన్నటితో 96,93,173 (95.75శాతం) మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 312 మంది మరణించగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,46,756 మంది బలయ్యారు. డిసెంబర్ 1 నుంచి 22వరకు వారాల వ్యవధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో చోటుచేసుకున్న మార్పును మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఉండగా.. మహారాష్ట్రలో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. 

ఇవీ చదవండి:

‘కొత్త’ కష్టం: 8 గంటలకు పైగా ఎయిర్‌పోర్టులోనే..

అంటార్కిటికానూ తాకిన కరోనా


 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని