ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు!

తాజా వార్తలు

Published : 27/12/2020 10:19 IST

ఆరు నెలల కనిష్ఠానికి కరోనా కేసులు!

దిల్లీ: భారత్‌లో కరోనా వృద్ధి రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 9,43,368 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,732 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దాదాపు గత ఆరు నెలల వ్యవధిలో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,187,850కి చేరింది. ఇక కొత్తగా 21,430 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 97,61,538కు చేరింది. దీంతో రికవరీ రేటు 95.82 శాతానికి చేరింది.

మరోవైపు, గడిచిన 24 గంటల్లో 279 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,47,622కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,78,690కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం.. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దాదాపు నెల రోజులుగా రోజువారీ రికవరీలు.. కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక కొత్త రకం వైరస్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో దాదాపు ఐదు శాతం పాజిటివ్‌ కేసుల నమూనాలకు సమగ్ర జన్యు విశ్లేషణ జరపాలని కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ నిర్ణయించింది.

ఇవీ చదవండి..

కరోనా చివరి మహమ్మారి కాదు: WHO

8 కోట్లు దాటిన కరోనా కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని