close

తాజా వార్తలు

Published : 13/08/2020 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్కరోజే 67వేల కేసులు, 942మంది మృతి!

47వేల మరణాలతో ప్రపంచంలోనే 4వ స్థానానికి భారత్‌..
దేశం‌లో 24లక్షలకు చేరువైన పాజిటివ్‌ కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 900మందికి పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా మరో 942 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 47,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ సంఖ్యతో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కి నెట్టేసింది. దాదాపు 46,700 మరణాలతో బ్రిటన్‌ ఐదో స్థానంలోకి పడిపోయింది. ఇక భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో నిత్యం దాదాపు 60వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. నిన్నఒక్కరోజే రికార్డుస్థాయిలో 66,999 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 16లక్షల 95వేల మంది కోలుకోగా మరో 6లక్షల 53వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న మరో 56వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70శాతంగా ఉండగా మరణాల రేటు దాదాపు 2శాతంగా ఉంది.

కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్‌, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం కొవిడ్‌ మరణాలు, కేసులు అధికంగా ఉన్న తొలి ఐదుదేశాల వివరాలు..

దేశం    మరణాల సంఖ్య    కేసుల సంఖ్య
అమెరికా    1,66,026       51,97,000
బ్రెజిల్‌      1,04,201       31,64,785
మెక్సికో     54,666         4,98,380
భారత్‌      47,033        23,96,637
బ్రిటన్‌      46,791          3,15,581


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.