71,559 రికవరీలు.. 66,732 కేసులు

తాజా వార్తలు

Published : 12/10/2020 10:28 IST

71,559 రికవరీలు.. 66,732 కేసులు

దిల్లీ: దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. గత 24 గంటల్లో 9,94,851 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 66,732 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో 8,61,853 మందికి చికిత్స కొనసాగుతుండగా.. 61,49,536 కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 816 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,09,150కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 71,559 మంది బాధితులు కోలుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా కొత్తగా వైరస్‌ బారిన పడుతున్న వారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉండడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.36 శాతంగా.. మరణాల రేటు 1.53 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,78,72,093 నమూనాల్ని పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని