close

తాజా వార్తలు

ఐఎల్‌పీ పరిధిలోకి మణిపూర్‌

దిల్లీ: ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ)ను మణిపూర్‌కూ వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణలను ఐఎల్‌పీ పరిధిలోని రాష్ట్రాలకు వర్తింపజేయబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌ వాసులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మణిపూర్‌ను కూడా ఐఎల్‌పీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం హోంశాఖ నోటిఫికేషన్‌ వెలువరించగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు.

ఐఎల్‌పీ పరిధిలో ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మణిపూర్‌ కూడా చేరింది. ఐఎల్‌పీ పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో ఇతరులు ఎవరైనా (ఇతర రాష్ట్రాల వారు సైతం) పర్యటించాలంటే అనుమతి తప్పనిసరి. బెంగాల్‌ తూర్పు సరిహద్దు నిబంధనలు-1873 ప్రకారం ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ ఆయా రాష్ట్రాలకు వర్తింపజేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.