close

తాజా వార్తలు

అసోంలో ఇంటర్నెట్‌ నిలిపివేత పొడిగింపు

గువహటి: అసోంలో నిరసనల నేపథ్యంలో ఇంటర్నెట్‌ సర్వీసులను మరో రెండు రోజులు పొడిగిస్తూ అధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం అనంతరం అసోం సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసోంలో శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు 48 గంటల ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. ఈ మేరకు డిసెంబర్‌ 16 వరకు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంజయ్‌కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం జరిగే ప్రమాదం ఉండటంతో ఆ గడువును మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొండంతో అసోంలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.