కొవిడ్‌ చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ వాడొద్దు.. డోసు ఎక్కువైతే తీవ్ర ప్రమాదకరం

తాజా వార్తలు

Updated : 09/09/2021 12:58 IST

కొవిడ్‌ చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ వాడొద్దు.. డోసు ఎక్కువైతే తీవ్ర ప్రమాదకరం

హెచ్చరించిన వైద్య నిపుణులు

వాషింగ్టన్‌: మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్న జీవుల నివారణకు వాడే ‘ఐవర్‌మెక్టిన్‌’ ఔషధాన్ని... కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించవద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ను ఈ ఔషధం సమర్థంగా అడ్డుకుంటుందని ఇప్పటివరకూ ఆధారాలు లేవన్నారు. ఈ మందును అతిగా వాడితే... వికారం, వాంతులు, మతిమరుపు, మూర్చతో పాటు మరణం కూడా సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఫెడరల్‌ డ్రగ్‌ ఏజెన్సీ హెచ్చరించింది! ‘‘ఐవర్‌మెక్టిన్‌ను మనుషులతో పాటు శునకాలు, గోవులు, గుర్రాలకు వివిధ రూపాల్లో ఇస్తుంటారు. మనుషులకు వాడే ఈ ఔషధ డోసుల వల్ల దుష్ప్రభావాలు పరిమితంగానే ఉంటాయి. జంతువుల కోసం ఉత్పత్తిచేసిన డోసులను మనుషులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఈ దుష్ప్రభావాలు వెయ్యిరెట్లు అధికంగా ఉండొచ్చు’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధకుడు డా.డేవిడ్‌ బౌల్‌వేర్‌ పేర్కొన్నారు. అమెరికాలో పశువుల మందుల దుకాణాల నుంచి చాలామంది కొవిడ్‌ రోగులు ఈ ఔషధాన్ని తీసుకెళ్లి వాడుతుండటం పట్ల వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

‘‘భారత్, బ్రెజిల్‌ దేశాల్లోనూ కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఐవర్‌మెక్టిన్‌ను వినియోగిస్తున్నారు. ఎఫ్‌డీఏ సూచించిన వ్యాధులకు మాత్రమే ఈ మందును తగిన డోసుల మేర వాడుకోవాలి. ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు దీన్ని వాడటం తక్షణం ఆపేయాలి’’ అని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులకు సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని