
తాజా వార్తలు
హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేస్తాను: బిడెన్
అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎన్నికల హామీ
వాషింగ్టన్: తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే.. హెచ్-1బీ వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ క్రమంలో ఓ వార్తా సంస్థ నిర్వహించిన సమావేశంలో జో బిడెన్ మాట్లాడుతూ..‘ఆయన(ట్రంప్) ఈ సంవత్సరాంతం వరకు హెచ్-1బీ వీసాల జారీని నిషేధించారు. నా పాలనలో అదేమీ ఉండదు. కంపెనీ వీసా మీద వచ్చిన వారు దేశ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఈ దేశం కోసం పాటుపడుతూ, లెక్కలోకి రానీ 11 మిలియన్ల వలసదారుల పౌరసత్వానికి సంబంధించి రోడ్‌మ్యాప్ కోసం ఒకరోజు ‘లెజిస్లేటీవ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ బిల్లు’ను కాంగ్రెస్‌కు పంపుతాను. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఆధునికీకరిస్తాను’ అని జో తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత 100 రోజుల కార్యచరణను వివరించారు. గ్రీన్‌కార్డులు, డ్రీమర్లకు సంబంధించిన అంశాలపై తన యంత్రాంగంలో తగిన నిర్ణయాలు తీసుకుంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్ అనుసరిస్తోన్న ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా క్రూరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
ఇవీ చదవండి: