
తాజా వార్తలు
బహిరంగంగానే టీకా తీసుకుంటా! బైడెన్
వాషింగ్టన్: దాదాపు ఏడాది కాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద కొన్నిదేశాలు వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ప్రజలకు భరోసా కలిగించేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్, క్లింటన్ వంటి నేతలు తాము బహిరంగంగానే టీకా వేయించుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ కూడా బహిరంగంగానే టీకా తీసుకునేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వ్యాక్సిన్ల సమర్థతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న ఆయన, వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ఎన్నికల్లో ఓటమిని ఇప్పటివరకూ ఒప్పుకోని డొనాల్డ్ ట్రంప్, వచ్చే నెల జరగబోయే బైడెన్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత గందరగోళానికి తెరతీయడంలో డొనాల్డ్ ట్రంప్ ఆ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ముఖ్యమని జో బైడెన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, అమెరికాలో కరోనా తీవ్రత నానాటికి పెరిగిపోతూనే ఉంది. నిత్యం దాదాపు రెండు లక్షల పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో పాటు 2వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 2,73,000కు చేరింది. వచ్చే రెండు నెలల్లో మరో 2లక్షల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు అమెరికా ఆరోగ్యశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి అమెరికా అధికారులు కృషి చేస్తున్నారు.
ఇవీ చదవండి..
ఓటమిని అంగీకరించేందుకు సిద్ధం..! ట్రంప్
‘మేడిన్ చైనా’ ఓ హెచ్చరిక నినాదం
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
