
తాజా వార్తలు
రైతులకు నిరసనకు అండగా ఉంటాం: కెనడా
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో రైతులు నిర్వహిస్తోన్న ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. శాంతియుత నిరసన హక్కులను పరిరక్షించేందుకు కెనడా ఎప్పుడూ అండగా ఉంటుందని రైతులకు సంఘీభావం ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా ఆన్లైన్ సమావేశంలో మాట్లాడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచ సిక్కు సంస్థ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది.
‘భారత్‌లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారనే వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబసభ్యుల గురించే. శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మేము చర్చల ప్రాముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళనను భారత అధికారుల ముందు వ్యక్తం చేశాం. మనందరిని ఒకదగ్గర కలిపి ఉంచే క్షణం ఇది’ అని రైతులకు మద్దతు తెలిపారు. అలాగే గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా..పంజాబ్, హరియాణా, తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు దిల్లీ శివారుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న నిరసనలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలకు ముగింపు పలికేందుకు ఈ రోజు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అయితే, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం కుదరదని కేంద్రం వారికి తేల్చి చెప్పే అవకాశం ఉందని, మద్దతు ధర, ప్రభుత్వ మార్కెట్లపై మాత్రం భరోసా ఇవ్వనుందని సంబంధిత వర్గాలు సమాచారం.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
