కర్ణాటకలో కర్ఫ్యూ..మహారాష్ట్రలో సడలింపు

తాజా వార్తలు

Published : 23/12/2020 16:10 IST

కర్ణాటకలో కర్ఫ్యూ..మహారాష్ట్రలో సడలింపు

ముంబయి: కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల పర్యాటక ప్రదేశాలను తెరిచేందుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. వాటర్‌స్పోర్ట్స్‌, నౌకా విహార్‌, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఇండోర్‌ వినోద కార్యక్రమాలకు అనుమతిచ్చింది. మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో.. మహా ప్రభుత్వం నిన్నటి నుంచి కార్పొరేషన్ల పరిధిలో రాత్రి కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. జనవరి ఐదు వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా చర్చిల్లో ప్రార్థన కార్యక్రమాన్ని మొదటి సారి రాత్రి పది గంటలకు ముందే జరుపుకోవాల్సి ఉంటుంది. 

కొత్త రకం కరోనా ఆందోళన కలిగిస్తోన్న తరుణంలో ఐరోపా, దక్షిణాఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చేవారిని దృష్టి పెట్టుకొని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

జనవరి 2 వరకు కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ: ఈ కొత్త తరహా వైరస్‌ కారణంగానే కర్ణాటక ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూను విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు మధ్యలో ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మహారాష్ట్ర తరవాత ఈ ఆంక్షలను విధించిన రెండో రాష్ట్రం కర్ణాటకనే. కొత్త రూపం సంతరించుకున్న వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని  ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. 

ఇవీ చదవండి:

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా: ఆయన రాకపోవచ్చు!

కరోనా అక్కడికీ దూరిపోయింది!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని