
తాజా వార్తలు
డిసెంబర్లో కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికలు
బెంగళూరు: కన్నడ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5,700లకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ బి. బసవరాజు సోమవారం తెలిపారు. ఎన్నికల ఫలితాలు 30వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 6,004 గ్రామ పంచాయతీలకు గానూ కేవలం 5,762 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 162 గ్రామ పంచాయతీల్లో పదవీ సమయం పూర్తి కాలేదు. ఆరు స్థానాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. 74 గ్రామ పంచాయతీలు పట్టణ పంచాయతీలుగా మారాయి. మొత్తం 92,121 గ్రామ పంచాయతీ వార్డులు ఉన్నాయి. 2.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 45,128 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కొవిడ్-19 దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. డిసెంబర్ 11, 16లను నామినేషన్ వేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరణకు డిసెంబర్ 14, 19 చివరి తేదీ. గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలకమైనవని గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
