తెలంగాణకు రూ.15కోట్ల సాయం: కేజ్రీవాల్

తాజా వార్తలు

Updated : 20/10/2020 14:27 IST

తెలంగాణకు రూ.15కోట్ల సాయం: కేజ్రీవాల్

దిల్లీ: భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో అతలాకుతలమవుతోన్న హైదరాబాద్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ.15కోట్ల అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ‘హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ సంక్షోభ సమయంలో హైదరాబాద్‌ వాసులకు దిల్లీ ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న సహాయక చర్యల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం తరపున రూ.15కోట్లను అందిస్తాం’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.పదికోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని