close

తాజా వార్తలు

Updated : 24/11/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసు చట్ట సవరణలపై వెనక్కి తగ్గిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: వివాదాస్పదంగా మారిన ‘కేరళ పోలీసు చట్ట’ సవరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చట్టంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఇప్పుడే అమలు చేయబోమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలపై కూలంకషంగా చర్చించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 

‘‘పోలీసు చట్టానికి మార్పులు చేస్తున్నామని ప్రకటించగానే వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మా ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వర్గాల నుంచీ ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సవరించిన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం సరైన చర్య కాదని భావిస్తున్నాం. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిస్తాం. అన్ని పార్టీల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం’’ - పినరయి విజయన్‌, కేరళ ముఖ్యమంత్రి

కేరళ పోలీస్ చట్టంలో చేసిన మార్పుల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా మరొకరిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు లేదా కించపరిచేలా పోస్టులు చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా సమాచారాన్ని పోస్ట్‌ చేస్తే చట్ట వ్యతిరేకమవుతుంది. నేర తీవ్రతను బట్టి రూ. 10 వేల జరినామా లేదా అయిదేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశమూ ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటాన్ని నిరోధించడానికే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ సవరణలపై వివిధ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 
 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన