close

తాజా వార్తలు

Updated : 04/12/2020 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ దినేశ్వర్‌ మృతి

ప్రధాని సంతాపం..

దిల్లీ: లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్‌ దినేశ్వర్ శర్మ(66) మృతికి శుక్రవారం ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు.‘ప్రభుత్వ కార్యకలాపాలు, దేశ భద్రతలో దినేశ్వర్‌ శర్మజీ ఎనలేని సేవలందించారు. ఆయన ఉద్యోగ కాలంలో ఎన్నో తిరుగుబాటు శక్తులను ఎదుర్కొన్నారు. సున్నితమైన సమస్యలను పరిష్కరించారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి  తెలుపుతున్నా. ఓం శాంతి’అని మోదీ ట్వీట్‌ చేశారు. బిహార్‌కు చెందిన దినేశ్వర్‌ శర్మ 1979లో కేరళ ఐపీఎస్‌ అధికారిగా పని చేశారు. అనంతరం 1991లో ఐబీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన తన ఉద్యోగ కాలంలో జమ్ము-కశ్మీర్‌లోని తిరుగుబాటు చర్యలను, ఈశాన్య రాష్ట్ర్రాల్లోని అల్లర్లను సమర్థంగా అణచివేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని