అలా చేస్తేనే కట్టడి చేయగలం: లవ్‌ అగర్వాల్‌
close

తాజా వార్తలు

Published : 27/03/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా చేస్తేనే కట్టడి చేయగలం: లవ్‌ అగర్వాల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యా్ప్తి నేపథ్యంలో దేశ ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయకపోతే స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కవవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ సరైన సమయంలో చికిత్స చేయించుకున్నట్లయితేనే దేశంలో ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలం అని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు సహకరించాలని కోరారు. సామాజిక దూరం పాటించడం తప్పనిసరన్నారు. దేశాన్ని కరోనా భూతం నుంచి కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. గడిచిన 24 గంటల్లోనే 42 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదైనట్టు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 649కి చేరిందన్నారు. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే 17 రాష్ట్రాల్లో కొవిడ్‌ 19 వైరస్‌ చికిత్సకు ఆస్పత్రులు ఏర్పాటుచేసే పని ప్రారంభమైందని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని