close
Array ( ) 1

తాజా వార్తలు

రైళ్లలో 3.2లక్షల ఐసోలేషన్‌ పడకలు:కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రైళ్లలో ఐసోలేషన్‌ పడకల కోసం 5 వేల రైల్వే కోచ్‌లను ఆధునీకరించామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ ఆగర్వాల్ తెలిపారు. వీటిలో దాదాపు 3.2 లక్షల ఐసోలేషన్‌ పడకలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 47 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1,637 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. గత 24 గంటల్లో 386 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమర్థంగా అమలవుతోందని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలని.. అప్పుడే కరోనాపై విజయం సాధ్యమని లవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా 21,486 సహాయ శిబిరాలు నడుస్తున్నా్యని.. వాటిలో 6.71 లక్షల మందికి వసతి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. నిత్యావసరాల కొనుగోలు సమయంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో కేబినెట్‌ కార్యదర్శి చర్చలు జరిపారని.. రాష్ట్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. లాక్‌డౌన్‌ తర్వాత కేంద్ర ప్రభుత్వం 6 లక్షల మంది వలస కూలీలకు వసతి కల్పిస్తూ 25 లక్షల మందికి ఆహారం అందిస్తోందని తెలిపారు. ఎవరూ భయాందోళన చెందవద్దని.. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.

ఇవీ చదవండీ..

దిల్లీ మర్కజ్‌కు వెయ్యికిపైగా వెళ్లారు:ఈటల

తబ్లిగి జమాత్‌కు 53మంది మేడ్చల్‌ వాసులు


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.