మారటోరియంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోండి

తాజా వార్తలు

Updated : 10/09/2020 14:37 IST

మారటోరియంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోండి

కేంద్రానికి మరో రెండువారాల గడువు

దిల్లీ: మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. ఈ సమయంలో అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్చించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను సమగ్రంగా కోర్టు ముందుంచాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే బ్యాంకులతోపాటు వివిధ రంగాల వాటాదారులతో సంప్రదింపులు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరగా, సుప్రీంకోర్టు అంగీకరించింది. మరోసారి వాయిదా ఉండదని, ఈసారి దీనిపై స్పష్టమైన నిర్ణయంతో ముందుకు రావాలని కేంద్రానికి సూచించింది. దీనికోసం రెండువారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్‌ 28కి వాయిదా వేసింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రుణగ్రహీతల ఖాతాలను మరో 2నెలలపాటు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని