close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120046778 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => NSsi2QY-ixg [video_short_link] => NSsi2QY-ixg [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-04-07 19:25:01.103421 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆ వార్తలు నమ్మొద్దు’

దిల్లీ: లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లవ్ అగర్వాల్‌ స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని చెప్పారు. పేదలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేయించామన్నారు. కరోనాపై సమన్వయానికి ఒక నూతన విధానం తీసుకొచ్చినట్లు లవ్‌ అగర్వాల్‌ వివరించారు. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించామని.. కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తామని వివరించారు. 

వైద్య సేవలను మూడు భాగాలుగా విభజించాం

కరోనా కట్టడికి జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రణాళికలు వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు దిల్లీ, ముంబయి, భిల్‌వాడా, ఆగ్రా ప్రాంతాల్లో సత్ఫలితాలు ఇస్తున్నట్లు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.  కరోనా వైరస్‌ వ్యాపించిన వారికి అందించే వైద్య సేవలను కరోనా కేర్‌ సెంటర్లు, కరోనా హెల్త్‌ సెంటర్లు, కరోనా ఆస్పత్రులు అనే మూడు భాగాలుగా విభజించామన్నారు. కరోనా కేర్‌ సెంటర్లలో అనుమానితులకు, కరోనా హెల్త్‌ సెంటర్లలో వైరస్‌ ప్రారంభదశలో ఉన్న వారికి, కరోనా ఆప్పత్రుల్లో వైరస్‌తో ఆరోగ్యం క్షీణించిన వ్యక్తులకు చికిత్సను అందచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐసీఎంఆర్‌ నివేదికల ప్రకారం కరోనా సోకిన వ్యక్తి లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే 30 రోజుల్లో దాదాపు 406 మందికి ఈ వైరస్ వ్యాపింపజేయగలడని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. గడచిన 24 గంటల్లో 354 కొత్త కేసులు నమోయ్యాయని ఆయన చెప్పారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 326 మంది కోలుకోగా.. 114 మంది మరణించినట్లు తెలిపారు.  



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.