
తాజా వార్తలు
రూ.10కే ‘శివ భోజన్’
మహారాష్ట్రలో నూతన పథకం
ముంబయి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో అధికార మహా అఘాడీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రూ.10కే భోజనం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ‘శివ భోజన్’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. ‘శివ భోజన్’ పథకాన్ని పలువురు మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లాంఛనంగా ప్రారంభించారు. ముంబయిలో మంత్రి అస్లాం షాయిక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సబర్బన్‌లో మరో మంత్రి ఆదిత్య ఠాక్రే, పుణెలో అజిత్ పవార్ తదితరులు ఈ భోజన కేంద్రాలను ప్రారంభించారు. కేవలం రూ.10కే పేదలకు భోజనం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో శివసేన పేర్కొన్న విషయం తెలిసిందే.
Tags :