
తాజా వార్తలు
మహారాష్ట్ర @ 2.5 లక్షల కేసులు
మహమ్మారికి ఒక్కరోజే 173 మంది బలి
ముంబయి: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీలలో దీని తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 7,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 173 మరణాలు సంభవించాయి. ఒక్క ముంబయిలోనే 1,263 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,54,427కి పెరిగింది. మరణాల సంఖ్య 10,289కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
* తమిళనాడులో కొత్తగా 4,244 కొవిడ్ కేసులు, 68 మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,38, 470కి పెరిగింది. మరణాల సంఖ్య 1,966కి చేరింది.
* కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 2,627 కేసులు నమోదు కాగా.. 71 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,843కు, మరణాల సంఖ్య 684కు పెరిగింది.
* దేశ రాజధాని దిల్లీలో కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1,573 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,494కు చేరింది. మరో 37 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 3,371కి పెరిగింది.
* పశ్చిమబెంగాల్లో 1560 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30వేలు దాటింది. గుజరాత్లో 879 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 41,897కి పెరిగింది. కేరళలో 435 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,743కి పెరిగినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.