
తాజా వార్తలు
మహారాష్ట్రలో తగ్గిన మరణాల రేటు
ముంబయి: భారత్‌లో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో గత నెల రోజుల వ్యవధిలో మరణాల రేటు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్ 22న 4.76 శాతంగా ఉన్న మరణాల రేటు మే 21 నాటికి 3.49 శాతానికి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఈ వ్యవధిలో మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత నెల 22న రాష్ట్రంలో 5,649 కేసులు నమోదుకాగా.. వారిలో 269 మంది మృత్యువాతపడ్డారు. ఇక శనివారం నాటికి కేసుల సంఖ్య 44,582కు పెరగ్గా.. మృతుల సంఖ్య 1,517కు చేరింది.
ప్రస్తుత మరణాల రేటు 3.40శాతంగా ఉంది. గత నెల రోజులుగా మరణాల రేటు క్రమంగా పడిపోతూ వస్తుండడం గమనార్హం. అదే సమయంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు సైతం భారీగా పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్ 22 నాటికి 89 వేల పరీక్షలు నిర్వహించగా.. నేటికి అది 3.22 లక్షలకు చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 86.74 శాతం మంది 60 ఏళ్ల లోపు వారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు గత ఆరు రోజులుగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయినా, ఇప్పటి వరకు రాష్ట్రంలో సామూహిక వ్యాప్తి లేదని ప్రభుత్వం చెబుతోంది.
ఇదీ చదవండి..
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
