close

తాజా వార్తలు

Published : 01/12/2020 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైట్‌హౌస్‌లో క్రిస్మస్: ట్రైలర్‌ చూస్తారా!

శ్వేతసౌధంలో మెలానియా చివరి క్రిస్మస్‌..

వాషింగ్టన్‌: ఈ సారి క్రిస్మస్‌ పండుగ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు చేదు, తీపి కలబోతగా నిలువనుంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ముగియటం.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించలేక పోవటంతో ఇదే వారికి శ్వేతసౌధంలో నాలుగవది, చివరిది కానుంది. పండుగ సందర్భంగా అధ్యక్షుడి సతీమణి మెలానియా ఆధ్వర్యంలో శ్వేతసౌధాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో 125 మందికి పైగా వాలెంటీర్లు పాల్గొన్నారట. ఈసారి ‘‘అమెరికా ది బ్యూటిఫుల్‌’’ అనే అంశం ఆధారంగా  అధ్యక్ష భవనాన్ని అలంకరించారు.

దీనిలో అమెరికా జాతీయ పతాకాలు, చిహ్నాలతో పాటు లెక్కకు మించిన గులాబీలు, విద్యుత్ దీపాలు, వేలాడే అలంకరణ వస్తువులు, రైళ్లు, విమానాలు, పడవలు.. ఇలా ఎన్నో భాగమయ్యాయి. ఎన్నో అద్భుతమైన పెయింటింగ్‌లు కూడా వీక్షకుల కన్నుల పండుగ కానున్నాయి.  ప్రముఖ మహిళా నేతల చిత్రలు కూడా ఈసారి  క్రిస్మస్‌ అలంకరణలో భాగం కావటాన్ని చూడవచ్చు. ఆ సొగసులను ఒక నిమిషం పాటు సాగే ఈ వీడియో రూపంలో మెలానియా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. భవనం అలంకరణకు దీటుగా మిలమిల మెరిసే బంగారపు రంగు దుస్తులతో, చక్కని చిరునవ్వుతో ఆమె ఉన్న ఈ వీడియో పలువురిని ఆకర్షిస్తోంది. వైట్‌హౌస్‌లో ఘనంగా జరిగే క్రిస్మస్‌ సంబరాలకు ట్రైలర్‌ లాంటి ఈ వన్‌ మినిట్‌ వీడియోను మీరూ చూసేయండి మరి!



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని