
తాజా వార్తలు
సముద్రంలో కూలిన మిగ్ శిక్షణ విమానం
(ప్రతీకాత్మక చిత్రం)
దిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నేవీ అధికారులు నేడు వెల్లడించారు. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. ఒక పైలట్‌ను కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరో పైలట్ గల్లంతయ్యారు. దీంతో అధికారులు గాలింపు చేపట్టారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ వెల్లడించింది.
కాగా.. గత ఏడాది కాలంలో మిగ్-29కే విమానం ప్రమాదానికి గురవడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో పక్షులు ఢీకొట్టడంతో మిగ్-29కే విమానం కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్లు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గతేడాది నవంబరులో సాంకేతికలోపం కారణంగా మిగ్ కూలిపోయింది. భారత నౌకదళానికి 40కి పైగా మిగ్-29కే యుద్ధ విమానాలున్నాయి. గోవా నేవీ బేస్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి వీటిని నిర్వహిస్తుంటారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
