close

తాజా వార్తలు

లైఫ్‌ ‘లక్ష్మణ్‌-ద్రవిడ్‌ ఇన్నింగ్స్‌లా’ ఉండాలి: మోదీ

దిల్లీ: బోర్డు ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయనగానే భయపడాల్సిన పనేమి లేదని ఏకాగ్రతతో ఆ భయాన్ని అధిగమించాలని ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు సూచించారు. దేశరాజధాని దిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షల భయాన్ని ఎలా అధిగమించాలనే దానికి సంబంధించిన సూచనలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మోదీ తనను విద్యార్థులకు స్నేహితునిగా పరిచయం చేసుకొన్నారు. దాదాపు రెండు వేల మంది ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చకు తెలంగాణ రాష్ట్రం నుంచి 19 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. విద్యార్థులు తనని #without filter పేరుతో ప్రశ్నలు అడగాలని మోదీ కోరారు. ‘పరీక్షా పే’ చర్చలో ప్రధాని కొన్ని  అంశాలు..

* ‘నా బాధ్యత రీత్యా నేను ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యాను. ఎంతోమందిని కలిశాను. ప్రతీ కార్యక్రమం ముఖ్యమైనదే.. వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీకు ఏ కార్యక్రమం బాగా నచ్చిందని కొంతమంది నన్ను అడిగారు. పరీక్షా పే చర్చా నా హృదయానికి చాలా దగ్గరగా నచ్చిందని చెప్పాను’. 

* ‘వైఫల్యమనేది జీవితంలో ప్రతిఒక్కరికీ ఎదురువుతోంది. కానీ, దాన్ని అధిగమించి విజయం వైపు మనం అడుగులు వేయాలి. చంద్రయాన్‌-2నే తీసుకోండి. అది విఫలమైనపుడు నేను చాలా బాధపడ్డాను. కానీ శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్లి వాళ్లను ప్రేరణ లభించేలా మాట్లాడాను. మన వైఫల్యాల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి’

* ‘2001లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతాలో టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అనిల్‌కుంబ్లే గాయపడినప్పటికీ వెనుదిరగకుండా తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో మన టీంఇండియా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఎలా ఆలోచించాలనే దానికి ఇదొక నిదర్శనం’ 

* ‘జీవితంలో పరీక్షలు ఒక భాగమే. విద్యాసంవత్సర ప్రయాణంలో బోర్డు పరీక్షలనేది ఒక మైలు రాయి. బోర్డు ఎగ్జామ్స్‌ ముఖ్యమే.. కానీ, అవే జీవితం అనుకోవడం మాత్రం సరైనది కాదు’ 

* పరీక్షల సమయంలో విద్యార్థులకు తమ తల్లిదండ్రులు అండగా నిలవాలి. పరీక్షల ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి వారికి కొన్ని సూచనలు చేయండి. 

* విద్యలో టెక్నాలజీ విద్యార్థులకు ఎంత వరకు ఉపయోగపడుతోందని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు. ‘మనకు అవసరమైనంత వరకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. స్మార్ట్‌ఫోన్లు మన సమయాన్ని హరించివేస్తున్నాయి. వాటితో గడుపుతూ మన సాధారణ జీవితాన్ని కోల్పోతున్నాం.  కుటుంబంలో నలుగులు సభ్యులు ఉంటే వారందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి. వాటితోనే సమయం గడుపుతుంటారు. ఇక నుంచి మన అందరి ఇళ్లలో ఒక ప్రత్యేక గది ఉండాలి. అందులో టెక్నాలజీకి చోటు ఉండకూడదు. అక్కడకు వచ్చేటపుడు ఎవరూ తమతో పాటు ఎటువంటి గ్యాడ్జెట్స్‌ తీసుకురాకూడదు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి. అలా చేయడం వల్ల మీ జీవితం మరింత ఆసక్తికరంగా మారుతోంది. అదే మీ జీవితాన్ని, టెక్నాలజీని సమతూకంగా చేస్తుంది’ అని అన్నారు. 

* పరీక్షలతో పాటు ఇతర వ్యాపకాల పై కూడా దృష్టి సారించాలి. అలా చేయడం వల్ల మీ ఆలోచనాసక్తి పెరుగుతోంది. 

* తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కొంత సమయాన్ని గడపాలి. వాళ్లకు ఏమి కావాలనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకోవాలి. 

* అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు ఒకరినొకరు పలకరించుకునేటపుడు ‘జైహింద్‌’ అని అంటారు. అక్కడి ప్రజలు తమ మాతృభాషతో పాటు హిందీలోను మాట్లాడతారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను నేను సందర్శించాను. అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ల మాతృభాషతో పాటు ఇతర భాషలో మాట్లాడుతూ తమని తాము పరిచయం చేసుకున్నారు. విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇతర భాషలపైనా పట్టు సాధించాలి. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.