ఏటికొప్పాక బొమ్మలపై మోదీ మనసులో మాట!

తాజా వార్తలు

Published : 30/08/2020 19:47 IST

ఏటికొప్పాక బొమ్మలపై మోదీ మనసులో మాట!

దిల్లీ: స్థానిక బొమ్మల తయారీలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను వివరించారు. అలాగే ఏటికొప్పాక బొమ్మలకు పునర్వైభవం తీసుకురావడంలో సి.వి.రాజు అనే కళాకారుడు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. 

‘‘దేశంలో కొన్ని ప్రాంతాలు బొమ్మల తయారీ కేంద్రాలుగా ఉన్నాయి. కర్ణాటక రాంనగర్‌లోని చెన్నపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాలోని కొండపల్లి, తమిళనాడులోని తంజావూరు, అసోంలోని ధుబ్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి.. ఇలా చాలా ప్రాంతాలు బొమ్మల తయారీకి పెరుగాంచాయి. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ చాలా పెద్దది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన సి.వి.రాజు అనే కళాకారుడి గ్రామమైన ఏటికొప్పాక బొమ్మల తయారీకి ఒకప్పుడు బాగా ప్రసిద్ధిగాంచింది. ఆ బొమ్మల విశిష్టత ఏంటంటే వాటిని పూర్తిగా చెక్కతో తయారు చేస్తారు. అలాగే బొమ్మలో ఎక్కడా పదునైన అంచులు ఉండవు. మొత్తంగా బొమ్మని ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా, నునుపుగా ఉంటుంది. దీనివల్ల పిల్లలకు ఎలాంటి గాయాలు కావు. ఈ ఏటికొప్పాక బొమ్మల అభివృద్ధి కోసం సి.వి.రాజు ఓ కొత్త ఉద్యమం చేపట్టారు. మరింత నైపుణ్యంతో బొమ్మలను తయారుచేస్తూ వాటికి పునర్వైభవం తీసుకొచ్చారు’’ అని రాజు చేస్తున్న కృషిని మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మల్లోని ప్రత్యేకతను వివరించారు.

ఇదీ చదవండి..

బొమ్మలనూ మనమే చేసుకుందాం: మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని