close

తాజా వార్తలు

Published : 05/07/2020 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో ఇళ్లలోనే కోలుకుంటున్నారు: కేజ్రీవాల్‌

దిల్లీ: దిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగతోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని పేర్కొన్నారు. చాలా మంది ఇళ్లలోనే కోలుకుంటున్నారన్నారు. గత వారం రోజుకి సగటున 2300 కేసులు నమోదైనప్పటికీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మాత్రం 6200 నుంచి 5300కు తగ్గిందని తెలిపారు. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 10 వేల పడకలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు.

దిల్లీలో శనివారం కొత్తగా 2,505 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 97,200కు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 2,500 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68,256కు చేరింది. దిల్లీలో రికవరీ రేటు దాదాపు 70 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ కరోనా కట్టడిలో ముందున్న వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు సహా ఇతర అత్యవసర సేవలకు చెందిన వారిని అభినందించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని