Narendra Giri: మహంత్‌ నరేంద్ర గిరి ఆత్మహత్య!

తాజా వార్తలు

Updated : 21/09/2021 11:40 IST

Narendra Giri: మహంత్‌ నరేంద్ర గిరి ఆత్మహత్య!

ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని బాఘంబరి మఠంలోని అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడిందని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.పి.సింగ్‌ వెల్లడించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన శిష్యులు ఫోన్‌ చేయడంతో తాము అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని తెలిపారు. మానసికంగా తీవ్ర కలతకు గురైన తాను జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసి ఉందన్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేస్తున్నామని, శవ పరీక్ష, ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని ఐజీపీ తెలిపారు. ఆశ్రమంలోని వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అఖాడా పరిషత్‌ కార్యవర్గ సభ్యులు వచ్చిన తర్వాత వారితో చర్చించి అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మహంత్‌ నరేంద్రకు ఏప్రిల్‌ నెలలో కొవిడ్‌ సోకింది. దేశంలోనే అతిపెద్దదైన సాధువుల పరిషత్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. మహంత్‌ నరేంద్ర ఆకస్మిక మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని