మోదీ దశాబ్దాల చీకటిని పారదోలారు

తాజా వార్తలు

Published : 05/08/2020 14:35 IST

మోదీ దశాబ్దాల చీకటిని పారదోలారు

దిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి నేటికి ఏడాది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..ప్రధాని మోదీ దశాబ్దాలుగా నెలకొన్న చీకటిని పారదోలారని కొనియాడారు. 
‘జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లోని సామాన్య ప్రజలకు న్యాయం, శాంతి, శ్రేయస్సును కల్పించడానికి, అభివృద్ధిని, అవకాశాలను తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీజీ దశాబ్దాలుగా నెలకొన్న చీకటిని తొలగించారు. అధికరణ 370ను రద్దు చేయడం ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాజీ దేశాన్ని ఏకం చేశారు. దాంతో కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి అధికారం లభించింది’ అని గోయల్ ట్వీట్ చేశారు.

2019, ఆగస్టు5న అధికరణ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ ప్రాంతం.. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటైంది. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం..జనవరి నుంచి జులై మధ్య కాలంలో ఇక్కడ హింసాపూరిత ఘటనలు 120కి పడిపోయాయని, ఇదే సమయంలో గతేడాది ఈ సంఖ్య 198గా ఉందని వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని