
తాజా వార్తలు
ఉగ్రదాడి సమయంలో ఆయనతో మాట్లాడా: ఠాక్రే
ముంబయి: రాష్ట్రంపై ఉగ్రవాదదాడులు పునరావృతం కాకుండా పోలీసు శాఖ సంసిద్ధంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడి జరిగి 12ఏళ్లు గడిచిన క్రమంలో.. ఆ దుర్ఘటనలో అమరులైన పోలీసులకు ఆయన గురువారం నివాళులర్పించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఠాక్రే అమరులైన పోలీసుల గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం కొవిడ్ సమయంలో మహారాష్ట్ర పోలీసులు చేసిన కృషిపై ‘ట్రూ గిప్ట్’ అనే కాఫీ బుక్‌ను ఆవిష్కరించారు.
ఠాక్రే మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖను సమర్థవంతంగా చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. రాష్ట్రం, లేదా రాజధానిపై ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా పోలీసు శాఖ సంసిద్ధం ఉండాలి. ఒకవేళ ఉగ్రవాదులెవరైనా అలాంటి ఆలోచనతో ముందుకు వస్తే తక్షణమే కాల్చిపారేయాలి’ అన్నారు.
అనంతరం ఠాక్రే 2008, 26/11 ఉగ్రదాడి నాటి క్షణాలను గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను నాసిక్ పర్యటనలో ఉన్నా. దాడుల విషయం తెలిసి ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్కు ఫోన్ చేయగా..‘ఇప్పుడే ఇంటికి వచ్చాను.. మళ్లీ వెంటనే వెళ్తున్నాను’అని చెప్పారు. కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేయగా..‘తాజ్ హోటల్ ముందు ఉన్నాను. కొద్ది సేపట్లో లోనికి వెళ్తాం’ అన్నారు. అనంతరం మరోసారి ఫోన్ చేయగా సలాస్కర్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరులయ్యారని దిగ్బ్రాంతి కలిగించే విషయం తెలిసింది’’ అని ఠాక్రే భావోద్వేగంతో తెలిపారు. హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. ఆ దాడులు దేశంలో సంక్షోభ వాతావరణాన్ని సృష్టించాయన్నారు. అంతేకాకుండా అజ్మల్ కసబ్‌ను పట్టుకోవడంతో పొరుగుదేశం పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడిందని తెలిపారు.
మహారాష్ట్ర రాజధానిపై ముంబయిపై నవంబర్ 26, 2008న పాక్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్, ఒబేరాయ్ హోటల్, కామా ఆస్పత్రిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 166 మంది ప్రజలు, 18 మంది భద్రతా సిబ్బంది మరణించారు. మరికొద్దిమంది గాయాల పాలయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక దళం చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు సీపీ అశోక్ కమ్టే, సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్, ఏఎస్సై తుకారామ్ ఓంబ్లే వంటి ఉన్నతాధికారులు అమరులైన వారిలో ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఏఎస్సై తుకారాం ధైర్య సాహసాలు ప్రదర్శించి కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ క్రమంలో కసబ్ కాల్పులు జరిపినప్పటికీ.. ఓంబ్లే వాటిని లెక్కచేయకుండా కసబ్‌ను ప్రాణాలతో పట్టించి తాను మరణించారు. అజ్మల్‌ను నవంబర్ 21, 2012న ఉరితీశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
