close

తాజా వార్తలు

Published : 29/11/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతుల ఆందోళనలను అలా అనలేదు: అమిత్‌ షా

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి స్పందించారు. రైతుల ఆందోళనలు రాజకీయ ప్రేరేపిత నిరసనలుగా తానెప్పుడూ పేర్కొనలేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా అలా పిలవనని అభిప్రాయపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి అమిత్‌షా, ఈ విధంగా స్పందించారు.

‘దిల్లీ చలో’ పేరుతో పంజాబ్‌ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో భాజపాకే చెందిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ఈ ఆందోళనలపై ఘూటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనల వెనుక రాజకీయ పార్టీలు హస్తం ఉందని, వారి మద్దతుతోనే రైతులు చలో దిల్లీకి పిలుపునిచ్చారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు, నిరసన తెలుపుతున్న పంజాబ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చర్యలకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా, రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. ఆందోళనలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇదిలాఉంటే, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తోన్న వివిధ రాష్ట్రాల్లోని 30 రైతు సంఘాలు ప్రస్తుత ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యాయి. సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమైనప్పటికీ, షరతులు విధించడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నేరుగా రైతులతోనే చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. ఇక డిసెంబర్‌ 1 నుంచి రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు పోరాట సమితి పిలుపునిచ్చింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన