నూతన పార్లమెంట్‌ భవనం @ 2022

తాజా వార్తలు

Published : 23/10/2020 21:12 IST

నూతన పార్లమెంట్‌ భవనం @ 2022

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ నుంచి భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు లోక్‌సభ సచివాలయం‌ వెల్లడించింది. శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణ పనుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యాధునిక హంగులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణం 2022 అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ నూతన భవనంలో ప్రతి ఎంపీకి డిజిటల్‌ హంగులతో ప్రత్యేక కార్యాలయం ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ భవన సముదాయంలో కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌, ఎంపీల లాంజ్‌, లైబ్రరీ, కమిటీ రూమ్‌లు, డైనింగ్ ప్రదేశాలు, తగినంత పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. నూతన భవనం నిర్మాణ పనులు కొనసాగినప్పటికీ  పార్లమెంట్‌ సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ప్రస్తుత భవనంలోనే అవి కొనసాగుతాయని స్పష్టంచేసింది. కొత్త భవనం నిర్మాణం సమయంలో వాయు, శబ్ధ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని