close

తాజా వార్తలు

పేలిన అగ్నిపర్వతం..పక్కనే పర్యాటకులు..!

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఓ అగ్నిపర్వతం సోమవారం ఒక్కసారిగా పేలింది. ఈ సమయంలో దాదాపు 100మంది అక్కడ ఉన్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ ప్రకటించారు. వారిలో కొంతమంది గల్లంతైనట్లు.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. న్యూజిలాండ్ తీరానికి తూర్పు దిశగా 50కి.మీ దూరంలో ఉన్న వైట్‌ అని పిలిచే ద్వీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే వైద్య సిబ్బంది, ఇతర అధికారులు హెలికాప్టర్‌లో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రమాదానికి కొద్దిసేపటి ముందు భూమిలో కదలికలు గమనించి కొంతమంది పరుగులు తీశారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అగ్నిపర్వతంలో పలు మార్పులు సంభవించినట్లు.. పేలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల్ని ఎందుకు అనుమతించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.