సచిన్‌‌కు ఊరట: శుక్రవారం వరకు చర్యలొద్దు..!

తాజా వార్తలు

Published : 21/07/2020 16:45 IST

సచిన్‌‌కు ఊరట: శుక్రవారం వరకు చర్యలొద్దు..!

రాజస్థాన్‌ హైకోర్టు వెల్లడి

జైపూర్‌: రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు తాత్కాలిక ఊరట కలిగింది. జులై 24 వరకు సచిన్‌ పైలట్‌తోపాటు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్‌ హైకోర్టు స్పీకరుకు సూచించింది. రెబల్‌ ఎమ్మెల్యేలు వేసిన రిట్‌పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తీర్పును జులై 24కు వాయిదా వేసింది. స్పీకర్‌ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు రాజస్థాన్‌ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. 

ఇదిలాఉండగా, ఈ సాయంత్రం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన  రాష్ట్ర కేబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది.  ఈ ఉదయం ప్రారంభమైన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని