చైనాతో చర్చలు ఎటూ తేలలేదు: రాజ్‌నాథ్‌
close

తాజా వార్తలు

Published : 30/12/2020 17:56 IST

చైనాతో చర్చలు ఎటూ తేలలేదు: రాజ్‌నాథ్‌

దిల్లీ : తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాతో జరిపిన సైనిక, దౌత్యపరమైన చర్చల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం తేలలేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దుల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బలగాల మోహరింపును ఉపసంహరించుకునేంది లేదని తేల్చి చెప్పారు. తర్వాతి దఫా చర్చలు ఎప్పుడైనా జరగొచ్చని తెలిపారు. బుధవారం ఓ ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బలగాల మోహరింపు అలాగే కొనసాగడం ఇరు దేశాలు ఏమాత్రం మంచిది కాదని రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. తదుపరి జరిగే చర్చలు పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత జరగాల్సిన సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరపాలో ఇప్పటికే చైనాకు సమాచారం పంపామన్నారు. వీలైనంత త్వరగా చర్చలు జరిపేందుకు వారు కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. తద్వారా బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేయాలనుకుంటున్నారన్నారు.

ఇవీ చదవండి..

‘రాహుల్ పుట్టుకతోనే ధనవంతుడు..’

మొదటిసారి టీకా సామర్థ్యంపై చైనా సమాచారం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని