close

తాజా వార్తలు

Updated : 03/12/2020 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకా సమాచారంపై ఉ.కొరియా హ్యాకర్ల దాడి..!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ భయంతో వణికిపోతోన్న ఉత్తర కొరియా, వ్యాక్సిన్‌ కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశాధినేత కిమ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అక్కడి హ్యాకర్లు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తోన్న సంస్థలపై దాడులకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, దక్షిణ కొరియాకు చెందిన ఫార్మా సంస్థల నుంచి కీలకమైన సమాచారాన్ని తస్కరించే ఉద్దేశంతోనే ఈ దాడులకు పాల్పడ్డట్లు వెల్లడైంది. ఇప్పటివరకు తొమ్మిది సంస్థలపై దాడులు చేసేందుకు పయత్నించారని బయటపడింది. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఆస్ట్రాజెనికా లక్ష్యంగా హ్యాకర్లు దాడులకు ప్రయత్నించినట్లు ఇప్పటికే అమెరికన్‌ మీడియా పేర్కొంది. తాజాగా మరో ఫార్మా దిగ్గజం జాన్సన్‌ & జాన్సన్‌, నొవావాక్స్‌తో పాటు మొత్తం తొమ్మిది వ్యాక్సిన్‌ సంస్థలపై దాడులకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. వీటిలో దక్షిణ కొరియాకు చెందిన రెండు ఫార్మా కంపెనీలతో పాటు జర్మనీ, అమెరికా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కూడా ఉన్నట్లు తేలింది.

గత సెప్టెంబర్‌ నుంచే హ్యాకర్లు ఈ దాడులను ప్రారంభించారని వీటిపై విచారణ చేపట్టిన అంతర్జాతీయ సైబర్‌ నిపుణులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం చేసిన దాడులతో ఎలాంటి సమాచారాన్ని తస్కరించారనే అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆయా సంస్థలు తమ సమాచారం భద్రతపై సమీక్ష జరుపుతున్నాయి. ఈ దాడులకు ఉపయోగించిన వెబ్‌ డొమైన్లు, సర్వర్లు ఉత్తర కొరియా హ్యాకింగ్‌ గ్రూపునకు చెందినవేనని ఇప్పటికే అమెరికా భద్రతా విభాగం కూడా స్పష్టంచేసింది.

ఇదిలాఉంటే, ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదైనట్లు కిమ్‌ ప్రభుత్వం ప్రకటించలేదు. అంతేకాకుండా, సైబర్‌ దాడులపై వస్తోన్న వార్తలను కూడా కిమ్‌ ప్రభుత్వం ఖండించింది. కానీ, దక్షిణ కొరియా నిపుణులు మాత్రం కరోనా వైరస్‌పై ఉత్తర కొరియా స్పందనను తోసిపుచ్చుతోంది. చైనాతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ లేకపోవడాన్ని వారు కొట్టిపారేస్తున్నారు.

ఇవీ చదవండి..

కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

అవును..కిమ్‌ టీకా వేయించుకున్నారు..!



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన