మేం పారిపోం.. ఏ అంశంపైనైనా చర్చకు రెడీ!

తాజా వార్తలు

Published : 03/09/2020 02:36 IST

మేం పారిపోం.. ఏ అంశంపైనైనా చర్చకు రెడీ!

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ

దిల్లీ: ఈ నెల 14 నుంచి జరగబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేయడం పట్ల పలు రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శలపై కేంద్రం స్పందించింది. బీఏసీలో నిర్ణయించిన ఏ అంశంపైనా చర్చకు సిద్ధమని, చర్చ నుంచి తామేమీ పారిపోవాలనుకోవడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించామన్నారు. చాలా పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపినట్టు చెప్పారు. ఏ సమయంలోనైనా అడగగలిగే అన్‌స్టార్‌డ్‌ ప్రశ్నలకు (వీటికి మంత్రులు మౌఖికంగా సమాధానం ఇవ్వక్కర్లేదు. లిఖితపూర్వకంగా ఇస్తే సరిపోతుంది) కేంద్రం సిద్ధమేనన్నారు.

శూన్యగంట సమయం 30 నిమిషాల పాటు ఉండేలా చూడాలని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరినట్లు చెప్పారు. దీనిపై తుది నిర్ణయం వాళ్లు తీసుకుంటారని చెప్పారు. ఈ అంశంపై కేంద్రమంత్రులు అర్జున్‌ రాం మేఘ్వాల్‌, వి.మురళీధరన్‌, తాను ప్రతి రాజకీయ పార్టీతో మాట్లాడామన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేయడాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెబ్రెక్‌ ఓబ్రెయిన్‌ మినహా అందరూ అంగీకరించినట్టు చెప్పారు. మరోవైపు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేయడాన్ని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు సీపీఐ విమర్శించాయి. కరోనా మహమ్మారి పేరిట ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని