చట్ట సభల్లో ఈసారి పేపర్‌ బ్యాలెట్లే!

తాజా వార్తలు

Published : 09/09/2020 01:12 IST

చట్ట సభల్లో ఈసారి పేపర్‌ బ్యాలెట్లే!

దిల్లీ: రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చట్టాల రూపకల్పనలో ఇప్పటికంటే కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. బిల్లులపై ఓటింగ్‌ కోసం ఎలక్ట్రానింగ్‌ ఓటింగ్‌ వ్యవస్థ బదులు పేపర్‌ బ్యాలెట్‌లను ఉపయోగించడమే ఇందుకు కారణం. ఈ నెల 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారాంతపు సెలవులూ లేకుండా ఉభయ సభలు నిర్వహించాడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా వివిధ బిల్లులపై సభ్యులు ఓటు వేసేందుకు ఈసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించడం లేదు. ఈ మేరకు పార్లమెంట్‌ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. 

గతంలో బిల్లులపై ఓటింగ్‌ కోసం బ్యాలెట్‌ పద్ధతినే అమలు చేసే వారు. కానీ, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాలు అందుబాటులోకి తేవడంతో చట్ట సభల్లోనూ  ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. ఓటింగ్‌ సమయంలో యంత్రంలో లోపాలు తలెత్తినా, సభ్యులు పొరపాటున వ్యతిరేక ఓటు వేసినా, వాళ్లకు బ్యాలెట్‌ను అందించేవారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వల్ల ఫలితం తేలేందుకు 5 నిమిషాలు పడితే.. బ్యాలెట్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దాదాపు 20 నిమిషాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

తాజా సమావేశాల్లో మూడు వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌లతోపాటు మొత్తం 11 ఆర్డినెన్స్‌లకు కేంద్రం ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న మరికొన్ని బిల్లులకు కూడా ఆమోద ముద్ర వేయనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సభ్యులంతా సామాజిక దూరం పాటించాలని పార్లమెంట్‌ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఉభయసభల్లోనూ ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు.  ఎవరికి కేటాయించి స్థానాల్లో వారే కూర్చోవాల్సి ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని