ముంబ‌యిలో 15ల‌క్ష‌ల మంది క్వారంటైన్‌లో..!
close

తాజా వార్తలు

Published : 07/07/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబ‌యిలో 15ల‌క్ష‌ల మంది క్వారంటైన్‌లో..!

వెల్ల‌డించిన బృహ‌న్ ముంబ‌యి మునిసిప‌ల్ కార్పొరేష‌న్

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఆందోళ‌నక‌ర స్థాయిలో కొనసాగుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో 2,11,987 మందికి వైర‌స్ సోక‌గా 9026మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనావైర‌స్ బ‌య‌ట‌ప‌డిన నుంచి ఇప్ప‌టివ‌రకు ముంబ‌యిలో మొత్తం 15ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జలు క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు బృహ‌న్ ముంబ‌యి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) వెల్ల‌డించింది. వీరిలో 5.34ల‌క్షల మందిని ఎక్కువ ప్ర‌మాదం ఉన్న కాంటాక్టులుగా గుర్తించిన‌ట్లు బీఎంసీ పేర్కొంది. అయితే, నిర్బంధంలో ఉన్న వారిలో ఇప్ప‌టికే 13.28ల‌క్ష‌ల మంది 14రోజుల క్వారంటైన్ గ‌డువు పూర్తిచేసుకున్న‌ట్లు తెలిపింది.

దిల్లో ల‌క్షకేసులు, 3వేల మ‌ర‌ణాలు..
ఇక దేశ‌రాజ‌ధాని దిల్లీలో క‌రోనా తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో నిన్న 1359 పాజిటివ్ కేసులు న‌మోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,823కి చేరింది. అంతేకాకుండా వీరిలో ఇప్ప‌టివ‌రకు 3115 మంది మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో దేశంలో అత్య‌ధిక  క‌రోనా కేసులు న‌మోదైన తొలి న‌గ‌రంగా దిల్లీ నిలిచింది.

క‌ర్ణాట‌క‌లో స‌మూహ‌వ్యాప్తి లేదు..
క‌ర్ణాట‌క‌లో గ‌త వారంరోజులుగా వైర‌స్ తీవ్ర‌త పెరిగిపోయింది. దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి చేయిదాటిపోతుందంటూ ఆ రాష్ట్ర మంత్రి మ‌ధుస్వామి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ స‌మూహ‌వ్యాప్తి ద‌శ‌కు చేరుకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చాలా పాజిటివ్‌ కేసుల్లో మూలాలు క‌నిపించ‌డంలేదని, వైర‌స్ విస్తృతిని అడ్డుకోవ‌డం జిల్లా అధికారులకు ఇబ్బందిగా మ‌రింద‌న్నారు. అయితే, మంత్రి స్పంద‌న‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న నెల‌కోవ‌డంతో తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం స్పష్ట‌త‌నిచ్చింది.  రాష్ట్రంలో క‌రోనావైర‌స్ స‌మూహ‌వ్యాప్తి ద‌శ‌కు చేరుకోలేద‌ని కేంద్రానికి నివేదించింది.

ఇవీ చ‌ద‌వండి...
భార‌త్‌లో 7ల‌క్ష‌ల కేసులు, 20వేల మ‌ర‌ణాలు
'హెర్డ్ ఇమ్యూనిటీ'పై స్పెయిన్ ఏమ‌న్న‌దంటే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని